Karma Veera Chakra Award: అనంతపురం రైతుకు కర్మ వీర చక్ర పురస్కారం

తనో సన్నకారు రైతు. కేవలం 30 సెంట్ల విస్తీర్ణంలో ఏడాది పొడవునా 20 రకాల పంటలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నాడు.
Karma Veera Chakra award to Anantapur farmer

అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన ఎం.నారాయణప్ప చేసిన  ప్రయోగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి, ఆర్‌ఈఎక్స్, కర్మ వీర్‌ గ్లోబల్‌ ఫెలోషిప్‌ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎన్జీఓస్‌ (ఐకాంగో) ఏటా అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే ‘కర్మవీర చక్ర’ పురస్కారం నారాయణప్పను వరించింది.

Grammy Award 2024: గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయిన ప్రధాని పాట

గతంలో ఈ అవార్డును వ్యవసాయ రంగంలో విశిష్ట ఖ్యాతిగడించిన దివంగత శాస్తవేత్త ఎంఎస్‌ స్వామినాథన్, క్రీడారంగంలో రాహుల్‌ ద్రావిడ్, పుల్లెల గోపీచంద్, కళా రంగంలో కాజోల్‌ తదితరులకు అందజేశారు. ఇప్పుడు వీరి సరసన నారాయణప్ప చోటుదక్కించుకున్నారు. న్యూఢిల్లీలో సోమవారం జరిగే కార్యక్రమంలో ఈ అవార్డుతో పాటు ‘కర్మ వీర గ్లోబల్‌ ఫెలోషిప్‌’ (2023–24) కూడా అందిస్తారు.

Dhahan Prize: దీప్తి బాబుతాకు పంజాబీ సాహిత్యంలో ధహన్ పురస్కారం

#Tags