Sudarsan Pattnaik: గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డు అందుకున్న ఇసుక శిల్పి ఈయనే!

జూలై 12న రష్యాలో జరిగిన అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లో ప్రముఖ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్ గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డును అందుకున్నాడు.

ఈ పోటీ జూలై 4 నుంచి 12వ తేదీ వరకు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ప్రసిద్ధ పీటర్ అండ్ పాల్ కోటలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 21 మంది ప్రముఖ శిల్పులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఒడిషాకు చెందిన భారతీయ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్ 1977 ఏప్రిల్ 15వ తేదీ జన్మించాడు.

ఆయన అందుకున్న అవార్డులు ఇవే..
భారత ప్రభుత్వం అతనికి 2014వ సంవత్సరంలో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కార అవార్డు అయిన పద్మశ్రీని ప్రదానం చేసింది. అదే ఏడాది అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో జరిగిన శాండ్ స్కల్ప్టింగ్ వరల్డ్ కప్‌లో పీపుల్స్ ఛాయిస్ అవార్డును అందుకున్నాడు. అలాగే.. 2019లో ఇటలీలోని లెక్స్‌లో జరిగిన అంతర్జాతీయ స్కార్రానో శాండ్ నేటివిటీ ఈవెంట్‌లో ఇటాలియన్ శాండ్ ఆర్ట్ అవార్డు తీసుకున్నాడు. ఈ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయుడు ఈయనే.

Roshni Nadar Malhotra: టెక్ దిగ్గజం రోష్ని నాడార్‌కు అత్యున్నత పురస్కారం

#Tags