Oscars 2023: ఒకే సినిమాకు 7 ఆస్కార్ అవార్డులు

95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఓ హలీవుడ్ సినిమాకు ఏడు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది.

‘ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All at Once) ఆస్కార్ వేడుకల్లో సత్తా చాటింది. మొత్తం 11 విభాగాల్లో నామినేషన్‌కు వెళ్లిన ఈ సినిమా ఏడు అవార్డులను సాధించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్ర్కీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో విజేతగా నిలిచింది. ఈ చిత్రంలో ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్ యో ఆస్కార్ అందకున్న తొలి ఆసియా మహిళగా నిలిచింది. 

ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈ సినిమాను డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ రచించి, డైరెక్ట్ చేశారు. మిచెల్ యో మెయిన్ లీడ్ రోల్‌లో నటించగా.. కే హుయ్ క్వాన్, జామీ లీ కర్టిస్ ప్రధాన పాత్ర పోషించారు. మల్టీవర్స్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

Oscars 2023: భారతీయ చిత్రానికి తొలి ఆస్కార్‌.. బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌'

#Tags