Gurukula Staff Issues: గురుకుల సిబ్బంది సమస్యలపై వినతి

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్య లను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య డిమాండ్‌ చేశా రు.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేత నాలు పెంచాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. వేతన చెల్లింపుల్లో ఇత రుల ప్రమేయం లేకుండా.. నేరుగా ప్రిన్సిపల్‌ నుంచి ఆన్‌లైన్‌ పద్ధతిలో జరపాలని సూచించారు.

చదవండి: Promotions: ఎస్సీ గురుకులాల్లో పదోన్నతులపై ‘Service Rules’ రద్దుచేయాలి

మధ్యవర్తుల ద్వారా చెల్లింపుల వల్ల కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభంలోపు ప్రభు త్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

#Tags