Intel layoffs 2023 : దిగ్గజ టెక్‌ కంపెనీ కీల‌క నిర్ణ‌యం.. వేలాది మంది ఉద్యో‍గులు ఇంటికి..!

దిగ్గజ టెక్‌ కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్స్‌ వరకు లేఆఫ్స్‌ ప్రకటింస్తున్నాయి. మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ సంస్థలు ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
intel layoffs 2023

ఈ కంపెనీలకు భిన్నంగా టెక్‌ దిగ్గజ సంస్థ ఇంటెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్థిక మాంద్యం రాబోతుందన్న అంచనాల నేపథ్యంలో కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులకు అందించే జీత భత్యాల్లో ఇంటెల్‌ కోత విధించింది.తాజాగా, భారత్‌లోని బెంగళూరు ఓల్డ్‌ ఎయిర్‌ పోర్ట్‌ రోడ్డులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 250,000 స్కైర్‌ ఫీట్‌ కార్యాలయాన్ని ఇంటెల్‌ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. 

రూ.450 కోట్ల విలువైన ఆఫీస్‌ బిల్డింగ్‌ను అమ్మేందుకు కొనుగోలు దారుల్ని బిడ్డింగ్‌ ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పాల్గొన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమ్మకం పూర్తయిన త్వరాత అదే ఆఫీస్‌ కార్యాలయాన్ని మూడేళ్ల పాటు ఇంటెల్‌ లీజుకు తీసుకోనుంది. ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉద్యోగులకు హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌ను అమలు చేయనుంది.    

వెలుగులోకి వచ్చిన నివేదికలు ఇవే..
బెంగళూరు ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులో ఉన్న ఆఫీస్‌ను అమ్ముతున్నారనే నివేదికపై ఇంటెల్‌ ప్రతినిధులు స్పందించారు. అమ్మకం నిజమేనని, హైబ్రిడ్ ఫస్ట్ కంపెనీగా, మా ఉద్యోగులు ఆన్ సైట్‌లో పనిచేస్తున్నప్పుడు వారి కోసం వర్క్‌స్పేస్‌లను రూపొందించేలా స్పేస్ వినియోగాన్ని అంచనా వేస్తున్నాం. అదే సమయంలో ఖర్చుల్ని తగ్గించుకుంటున్నామని చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.
 
14,000 మంది ఉద్యోగులు :

బెంగళూరు ఇంటెల్‌ కార్యాలయంలో 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిజైన్ అండ్‌ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన  వారు ఉన్నారు. 

కంపెనీ చరిత్రలోనే భారీ నష్టం.. కానీ

కోవిడ్‌-19 కారణంగా మహమ్మారి సంక్షోభ సమయంలో చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసిన విషయం తెలిసిందే. దీంతో పర్సనల్‌ కంప్యూటర్లకు గిరాకీ అమాంతం పెరిగింది. కంపెనీలు తిరిగి తెరుచుకుంటుండడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పీసీలకు గిరాకీ పడిపోయింది. వెరసీ ఆ ప్రభావం ఇంటెల్‌ క్యూ1 ఫలితాల పడింది. ఇంటెల్ ప్రతి షేర్‌ ఆదాయంలో 133 శాతం వార్షిక తగ్గింపు నమోదు కాగా, ఆదాయం సంవత్సరానికి దాదాపు 36 శాతం పడిపోయి 11.7 బిలియన్లకు పడిపోయిందని సీఎన్‌బీసీ నివేదిక తెలిపింది.ఈ పరిణామాలతో ఇంటెల్‌ ఎంత వీలైతే అంతే ఖర్చును తగ్గించుకుంటుంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న సొంత ఆఫీస్‌ బిల్డింగ్‌ను అమ్మేసి.. లీజుకు తీసుకుంటుందని సమాచారం.

#Tags