Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. మ‌రో ఏడాదిపాటు ఉచిత వ‌స‌తి

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి వ‌చ్చి ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తి స‌దుపాయాన్ని మ‌రో ఏడాదిపాటు ప్ర‌భుత్వం పొడిగించింది. స‌చివాల‌యం, అసెంబ్లీ, శాఖాధిప‌తులు, రాజ్‌భ‌వ‌న్ ఉద్యోగుల‌కు ఉచిత వ‌స‌తి స‌దుపాయం ఈ ఏడాది జూన్ 27వ తేదీ ముగిసింది. ఈ నేప‌థ్యంలో ఆ ఉద్యోగుల‌కు వచ్చే ఏడాది జూన్ 26వ తేదీ వ‌ర‌కు ఉచిత వ‌స‌తి స‌దుపాయం పొడిగిస్తూ సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ జీవో ఆర్టీ నెంబర్ 1438 ఉత్త‌ర్వులు జారీ చేసింది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారు. అయితే గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హెచ్ఓడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్‌ ఉద్యోగులకు ప్రభుత్వం ఉచిత వసతి కల్పించింది. 2017వ సంవ‌త్స‌రం నుంచి ఈ సౌకర్యాన్ని ఉద్యోగులకు అందిస్తున్నారు.

TSPSC Group-1 Mains Exam Time Changes 2024 : గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్డ్‌..గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల స‌మ‌యంను..

#Tags