AP Employees Salary Increment : గుడ్‌న్యూస్‌.. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు.. అలాగే ఇన్యూరెన్స్‌ సౌకర్యం కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
AP CM YS Jagan Mohan Reddy

ఈ మేర‌కు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో విద్యుత్‌ శాఖ ఔట్‌సోర్సింగ్‌ ఉ‍ద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్ ఈ మేర‌కు ఆగ‌స్టు 16వ తేదీన (బుధవారం)ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇన్యూరెన్స్‌ సౌకర్యం కూడా..
ఈ నేపథ్యంలో 27వేల మంది విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీఎం జగన్‌ సూచనలతో విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు ఆయన తెలిపారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది.  అలాగే, గ్రూప్‌ ఇన్యూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించింది.

#Tags