Telangana Student : ఏపీ కోర్టులో తెలంగాణ బిడ్డ... సక్సెస్ స్టోరీ ఇదే..
సాక్షి ఎడ్యుకేషన్: ఏపీలో నిర్వహించిన హైకోర్టు పరీక్షల్లో రెండోసారి పరీక్ష రాసి సివిల్ జడ్జీగా ఎంపికైంది ఈ తెలంగాణ బిడ్డ. పెద్దపల్లి జిల్లాలోని వడ్కాపూర్ గ్రామానికి చెందిన మొగురం మొండయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె గాయత్రి ఉన్నారు తండ్రి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు.. ఈ పరీక్షల ఫలితాలు ఈనెల 27న విడుదల కాగా, తాను సాధించిన ఫలితాలకు జడ్జీగా ఎంపికవ్వడం అభినందనీయం.
Constable Success Story : మా ఊరి నుంచి ఫస్ట్ పోలీస్ అయ్యింది నేనే.. కానీ..!
గాయత్రి తన కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేసింది. అనంతరం, ఉస్మానియాలో ఎల్ఎల్ఎం పూర్తి చేసింది. ఆ తరువాత, ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జీ పోటీ పరీక్షల్లో పాల్గొని, తొలిసారి అనుకున్న ఫలితం రాలేదు. ఈ ప్రయత్నంలో ఫలితం సాధించలేకపోయినప్పటికీ తన పట్టుదల, ఆత్మ విశ్వాసంతో మరో ప్రయత్నంలో భాగంగా రెండోసారి కూడా పరీక్షలో పాల్గొని నెగ్గారు గాయత్రి. దీంతో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారని ఫలితాల విడుదలతో తేలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దుల్లేవు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)