Inspirational Success Story : నా బిడ్డ పాల‌కు కూడా డ‌బ్బులు లేని ప‌రిస్థితి నాది.. ఇలా చేసి రూ.800 కోట్లు సంపాదించా.. కానీ..

ఒక రాయి.. ఎన్నో ఉలి దెబ్బలు త‌గిలితే..కానీ..అంద‌మైన శిల్పంగా మారుతుంది. ఇలాగే మనిషి జీవితం కూడా ఉంటుంది. ఇపుడు మనం తెలుసుకునే వ్య‌క్తి కూడా ఇలాంటి ఎన్నో కష్టాల‌ను ఎదుర్కొన్ని నేడు ఉన్న‌త స్థానంలో ఉన్నాడు.

ఒకపుడు త‌న బిడ్డకు పాలుకొనడానికి 14 రూపాయలకు వెతుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి అత‌నిది. మరిపుడు ఏకంగా రూ.800 కోట్లకు అధిపతి. ఇత‌నే..విజయ్ కేడియా. విజయ్ కేడియా సాధించిన విజయాలు.. ప‌డిన క‌ష్టాలపై ప్ర‌త్యేక స్టోరీ మీకోసం..

10వ తరగతి ఫెయిల్..
కోల్‌కతాకు విజయ్ కేడియా ఐఐటీ, ఐఐఎం లాంటి ఫ్యాన్సీ డిగ్రీలేమీ లేవు. ఉన్నదల్లా స్మార్ట్‌ బ్రెయిన్‌  జీవితంలో ఎదగాలనే సంకల్పం. మార్కెట్‌పై లోతైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిలియనీర్‌గా అవతరించాడు.  విజయ్ తండ్రి స్టాక్ బ్రోకర్. 10వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చనిపోయాడు. తండ్రిని కోల్పోయిన షాక్‌తో 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు.  దీనికి తోడు అతని కుటుంబ సభ్యులు అతనికి వివాహం చేశారు. వెంటనే ఒక బిడ్డ కూడా పుట్టింది.

➤ Success Story : తిన‌డానికి తిండిలేక ఎన్నో సార్లు ఆక‌లితోనే ఉన్నా.. ఈ క‌సితోనే కోట్లు సంపాదించానిలా..

పాలు కొనేందుకు రూ.14 కూడా లేక..

అలా ఒక్కో బాధ్యత, అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితి కష్టాల్లోకి నెట్టేసింది. కుటుంబం గడవడానికి తల్లి బంగారు ఆభరణాలను అమ్ముకున్నారు. కానీ అది మాత్రం ఎన్నాళ్లు ఆదుకుంటుంది. కనీసం కుమారుడికి పాలు కొనేందుకు రూ.14 కూడా  లేక ఇబ్బందులు పట్టాడు. ఏదో ఒకవిధంగా ఒక్కో పైసా వెతికి అతని భార్య బిడ్డకు పాలు పట్టేది ఇది చూసి చలించిపోయిన విజయ్‌ కేడీ. కోల్‌కతా వదిలి ముంబైకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

☛ Real Life Success Story : ఈ కోరికతోనే.. ఓ సెక్యూరిటీ గార్డు.. ఏకంగా 23 సార్లు పోరాటం చేసి..చివ‌రికి పాస్ అయ్యాడిలా..

భారీగా డబ్బు సంపాదించానిలా..

తండ్రి ఇచ్చిన వారసత్వ నేపథ్యం, పరిస్థితులతో షేర్ మార్కెట్‌లో మెల్లిగా పెట్టుబడులు పెట్టాడు.  బుర్రకు పదును బెట్టి, మార్కెట్‌ను స్టడీ చేశాడు.  దలాల్ స్ట్రీట్‌లో బుల్లిష్‌రన్‌ కారణంగా 1992లో అదృష్టం కలిసి వచ్చింది. ఈ అవకాశాన్ని కేడియా క్యాష్ చేసుకున్న కొన్ని కీలకషేర్లలో పెట్టుబడల ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు.

కాటేసే పాములు కూడా..

ఆ తర్వాత ముంబైలో ఇల్లు కొని కోల్‌కతా నుంచి తన కుటుంబాన్ని  మార్చుకున్నాడు. అయితే  షేర్ మార్కెట్‌ పెట్టుబడులు అంటే వైకుంఠపాళి. నిచ్చెనలూ ఉంటాయి, కాటేసే పాములూ ఉంటాయి. అచ్చం ఇలాగే మళ్లీ మార్కెట్‌ కుప్పకూలడంతో సర్వం కోల్పోయాడు. అయినా ధైర్యం కోల్పోలేదు. 2002-2003లో మార్కెట్ మరో బుల్లిష్ రన్‌. చక్కటి పోర్ట్‌ఫోలియోతో  లాభాలను ఆర్జించాడు. ఫలితంగా విజయ్‌ నికర విలువ ఇప్పుడు రూ.800 కోట్లకు చేరుకుంది. దేశంలో అత్యంత గౌరవనీయమైన పెట్టుబడిదారులలో ఒకడిగా నిలిచాడు.  కేడియా సెక్యూరిటీస్ అనే కంపెనీని ప్రారంభించి కోటీశ్వరుడిగా రాణిస్తున్నాడు.

విజయం సాధించాలని ఆలోచిస్తున్న వారికి..
పెట్టుబడి ప్రపంచంలో విజయ్ కేడియాది ప్రతిష్టాత్మకమైన పేరు. అనేక ఆటుపోట్లతోనిండి వున్న విజయ్‌ జర్నీ ఇన్వెస్టింగ్ కెరీర్‌లో విజయం సాధించాలని ఆలోచిస్తున్న వారికి ఆయన స్ఫూర్తి. స్టాక్ మార్కెట్‌లో లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి. ఓపిక ముఖ్యం. అలాగే మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు రిస్క్‌ తీసుకునే ధైర్యం,సామర్థ్యం ఉండి తీరాలి.

☛ Young Talented: నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్న ఈ కుర్రాడు..ఎలా అంటే..?

#Tags