ఉచితంగా ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్సులు.. ఎవరెవరికంటే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వర్సిటీలు, కాలేజీలలోని విద్యార్థులు, అధ్యాపకులకు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్సులు ఉచితంగా అందించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
నాస్కామ్, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సహకారంతో దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో వీటిని అందిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి వివరించింది. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ పేరిట అందించే ఈ కోర్సులకు https://futureskillsprime.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
#Tags