Tomorrow Holidays 2024 : రేపు సెల‌వు.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌ష‌న్ : అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కార్యాల‌యాల‌కు దేశ‌వాప్తంగా మే 1వ తేదీన (బుధ‌వారం) సెల‌వు ఇచ్చారు.

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సంద‌ర్బంగా.. ఆయా రాష్ట్రాల‌ ప్ర‌భుత్వాలు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కార్యాల‌యాల‌ల్లో ప‌ని చేసే ఉద్యోగుల‌కు సెల‌వు ఇచ్చారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీకి, లోక్ సభకు మే 13వ తేదీన (సోమ‌వారం) ఒకేరోజు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. మే 13వ తేదీన ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి జారీచేశారు. రాష్ట్రంలో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కార్మిక శాఖ కూడా వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. అలాగే ఫ్యాక్టరీలు, షాపులు, ప్రజాప్రాతినిధ్య చట్టం, సముదాయాల చట్టం కింద కూడా సెలవును ప్రకటించారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

అలాగే తెలంగాణలో మే 13వ తేదీన (సోమ‌వారం) లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 13న వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటిస్తూ ఈసీఓ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా ఇతర రాష్ట్రాలకు అంటే.. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ గఢ్ కు చెందిన ఉద్యోగులు తమతమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళినట్లైతే.. వారికి కూడా వేతనం ఇవ్వాల్సిందిగా ఆయన జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

#Tags