Promotions: ఎస్సీ గురుకులాల్లో పదోన్నతులపై ‘Service Rules’ రద్దుచేయాలి

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లోని ఉద్యోగులందరికీ ఒకే విధమైన సర్వీసు నిబంధనలు వర్తింపజేయాలని తెలంగాణ గురుకుల ఉద్యో గుల జేఏసీ డిమాండ్‌ చేసింది.

ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని ఉద్యోగులకు పదోన్నతుల విభాగంలో ప్రత్యేక సర్వీసు నిబంధనలున్నాయని తెలిపింది. సాధారణంగా ఉద్యోగులకు సర్వీసు ఆధారంగా పదోన్నతులు ఇస్తుంటే ఎస్సీ గురుకుల సొసైటీలో ప్రిన్స్‌పల్‌ పదోన్నతులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం, అందులో వచ్చిన మార్కుల ఆధా రంగా పదోన్నతులు ఇస్తున్నారని వెల్లడించింది.

చదవండి: Gurukul School Admissions for 5th Students: ఈ రెండు రోజుల్లో గురుకుల ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక..

ఈ ప్రక్రియ ఉద్యోగుల్లో తీవ్ర మానసిక క్షోభ కలిగిస్తోందని జేఏసీ ప్రతినిధి, తెలంగాణ ఆల్‌ రెసిడెన్షినల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (టిగారియా) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి నారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. అన్ని గురుకులాల్లోని ఉద్యోగులందరికీ ఒకే విధమైన సర్వీసు నిబంధనలుండాలన్నారు. అలాగే ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగుల పదోన్నతులు, నూతన నియామకాల విషయంలో 70:30 నిష్పత్తిని 50:50 నిష్పత్తిలో అమలు చేస్తున్నారని, దీంతో ఉద్యోగులు పదోన్నతులు రాకుండా నష్టపోతున్నారని చెప్పారు.

చదవండి: Inter Board: గురుకుల సొసైటీల ఇష్టారాజ్యం!

ఈ రెండు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ముఖ్య కార్యదర్శి సానుకూలంగా స్పందించారని నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.  

#Tags