List of Exams in January 2025: సీబీఎస్‌ఈ టూ జేఈఈ మెయిన్స్ వరకు.. జనవరిలో జరగనున్న పరీక్షల లిస్ట్ ఇదే
జనవరి 2025లో జరగనున్న పరీక్షలు ఇవే..
సీబీఎస్‌ఈ ప్రాక్టికల్ పరీక్షలు
ఈ సంవత్సరం ప్రారంభంలోనే సీబీఎస్‌ఈ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు మొదలుకానున్నాయి. బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, సీబీఎస్‌ఈ బోర్డు రెగ్యులర్ సెషన్ పాఠశాలలకు 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు 2025, జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి 14 మధ్య జరగనున్నాయి.
యూజీసీ నెట్ పరీక్ష
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డిసెంబర్ 2024 సెషన్ కోసం యూజీసీ నెట్ పరీక్షను 2025, జనవరి 3, నుండి జనవరి 16 వరకు నిర్వహించనుంది. ఈ పరీక్ష 85 సబ్జెక్టులలో కొనసాగుతుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యూపీ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు
యూపీ బోర్డు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 23 నుండి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్ష జనవరి 23 నుంచి 31 వరకు, ఫిబ్రవరి 1 నుంచి 8 వరకు రెండు దశల్లో నిర్వహించనున్నారు.
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్-2 పరీక్ష
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్)టైర్-2 పరీక్షను 2025, జనవరి 18, 19,20 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా గ్రూప్ బీ, సీ మొత్తం 17,727 పోస్టులను భర్తీ చేయనున్నారు. టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే టైర్-2కు హాజరుకాగలుగుతారు. మరింత సమాచారం కోసం ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
యూకేసీఎస్‌సీ ఎస్‌ఐ పరీక్ష
ఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ (యూకేసీఎస్‌సీ ఎస్‌ఐ) పోస్టుల రిక్రూట్‌మెంట్ పరీక్ష తేదీని ప్రకటించింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2025, జనవరి 12న నిర్వహిస్తున్నారు. ఆరోజు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష ఉండనుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను 2025, జనవరి 2 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 222 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
యూపీఎస్‌సీ సీఎస్‌ఈ 2024 ఇంటర్వ్యూ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) జనవరి 7 నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీలు, ఇతర వివరాల కోసం యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించవచ్చు.
జేఈఈ మెయిన్స్ పరీక్ష
ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ మొదటి సెషన్ 2025, జనవరి 22 నుండి జనవరి 31 వరకు జరుగుతుంది. అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు పరీక్షకు మూడు రోజుల ముందు జారీ చేస్తారు. అయితే పరీక్ష జరిగే ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే అందుబాటులో ఉంచనున్నారు. మరిన్ని వివరాల కోసం nta.ac.in ని సందర్శించవచ్చు.
Exam Dates In January 2025
పరీక్ష పేరు | పరీక్ష తేదీలు |
---|---|
ISRO-HSFC వివిధ ఖాళీల 2024 CBT పరీక్ష తేదీ | 02/01/2025 |
DSE తెలంగాణ – TG TET 2024 పరీక్ష షెడ్యూల్ | 02 నుండి 20/01/2025 |
TSPSC – మహిళా & శిశు సంక్షేమ అధికారి 2022 కొత్త రాత పరీక్ష షెడ్యూల్ | 03 & 04/01/2025 |
TSPSC – (సూపర్‌వైజర్) గ్రూప్ I 2022 కొత్త రాత పరీక్ష షెడ్యూల్ | 06 & 07/01/2025 |
NTA – UGC NET డిసెంబరు 2024 పరీక్ష షెడ్యూల్ | 03/01/2025 నుంచి 16/01/2025 |
BPSC 70వ CCE 2024 ప్రీలిమ్స్ రీ-ఎగ్జామ్ తేదీ | 04/01/2025 |
అలహాబాద్ హైకోర్టు – గ్రూప్ C & D 2024 స్టేజ్-I పరీక్ష తేదీ | 04 & 05/01/2025 |
UPSSSC ఆడిటర్ & అసిస్టెంట్ అకౌంటెంట్ 2023 రాత పరీక్ష తేదీ | 05/01/2025 |
UPSSSC – డెంటల్ హైజీనిస్ట్ 2023 రాత పరీక్ష తేదీ | 05/01/2025 |
గుజరాత్ పోలీసు – PSI, కాన్స్టేబుల్ & జైల్ సిపాయ్ 2024 ఫిజికల్ టెస్ట్ తేదీ | 08/01/2025 నుంచి |
PSSSB – స్టెనో టైపిస్ట్ 2023 రీ షెడ్యూల్డ్ రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ తేదీ | 11/01/2025 |
JKPSC – వెటరినరీ అసిస్టెంట్ సర్జన్ 2024 కొత్త రాత పరీక్ష తేదీ | 12/01/2025 |
కేరళ TET నవంబర్ 2024 పరీక్ష తేదీ | 18 & 19/01/2025 |
OSSC కాంబైన్డ్ టెక్నికల్ సర్వీస్ (JE) 2023 ప్రిలిమినరీ పరీక్ష తేదీ | 19/01/2025 |
GPSC వివిధ ఖాళీల 2024 ప్రిలిమినరీ పరీక్ష షెడ్యూల్ | 23/01/2025 నుంచి 16/02/2025 |
సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు | 01/01/2025 నుంచి 14/02/2025 |
యూజీసీ నెట్ 2024 పరీక్ష | 03/01/2025 నుంచి 16/01/2025 |
యూపీ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు | 23/01/2025 నుంచి 31/01/2025, 01/02/2025 నుండి 08/02/2025 |
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్-2 పరీక్ష | 18, 19, 20/01/2025 |
యూకేసీఎస్‌సీ ఎస్‌ఐ పరీక్ష | 12/01/2025 (11 AM - 2 PM) |
యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ 2024 ఇంటర్వ్యూలు | 07/01/2025 నుంచి |
జేఈఈ మెయిన్స్ 2025 పరీక్ష | 22/01/2025 నుంచి 31/01/2025 |
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)