ఏపీ గ్రామ/వార్డు సచివాలయ రాత పరీక్షలు–2020 ‘కీ’ విడుదల.. సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌లో ‘కీ‘తో పాటు క్వశ్చన్‌ పేపర్‌ కూడా..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించి అధికారిక ‘కీ’ సెప్టెంబర్‌ 26వ తేదీన సాయంత్రం విడుదల చేశారు.
19 కేటగిరీల్లో మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్‌ 20వ తేదీ నుంచి 26 వరకు రోజుకు రెండు రాత పరీక్షలు చొప్పున జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 14 రకాల పరీక్షలకు సంబంధించిన అధికారిక ‘కీ’ ఒకసారే విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రామ/వార్డు రాతపరీక్షలు–2020 ‘కీ’ వివరాలను అభ్యర్థులు ‘సాక్షి ఎడ్యుకేషన్‌’ వెబ్‌ పోర్టల్‌(https://www.sakshieducation.com/) ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలన్ని ‘కీ’ తో పాటు క్వశ్చన్‌ పేపర్‌ కూడా సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థుల‌కు ఈ ప్రాథ‌మిక 'కీ' పై ఏవైన అభ్యంత‌రాలు ఉంటే సెప్టెంబ‌ర్ 29వ తేదీ లోపు దాఖ‌లు చేసుకొవ‌చ్చు. అభ్యంత‌రాలను నిపుణుల‌తో ప‌రిశీలించిన త‌ర్వాత‌...సె‌ప్టెంబ‌ర్ 30వ తేదీన ఫైన‌ల్ 'కీ' ని విడుద‌ల చేయ‌నున్నారు.

ఏపీ గ్రామ/వార్డు రాతపరీక్షలు–2020 ‘కీ’ తో పాటు ‘క్వశ్చన్‌పేపర్‌’ కోసం క్లిక్‌ చేయండి
https://www.sakshieducation.com/AP-Sachivalayam-2020-QP.html

#Tags