అక్టోబర్ 12 నుంచి ఏపీ పీసెట్- 20 ప్రవేశ పరీక్షలు

ఏఎన్‌యూ (గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), యూజీడీపీఈడీ (అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీపీసెట్-2020 పరీక్షలు ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతాయని సెట్ కన్వీనర్ డాక్టర్ పి.జాన్సన్ తెలిపారు.
ఈ నెల 5 నుంచి హాల్‌టికెట్లను ఏపీపీసెట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
#Tags