ఆగస్టు 14న తెలంగాణ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని 35 గురుకుల కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది (ఇంగ్లిష్‌ మీడియం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ)లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 14న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి సీహెచ్‌.రమణకుమార్‌ తెలిపారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుందన్నారు. విద్యార్థులు ఈనెల 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.
#Tags