Corporate colleges Admissions: కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థులకు ప్రవేశాలు

Latest Admissions News

ఖమ్మంమయూరిసెంటర్‌: ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న కార్పొరేట్‌ కళాశాలల ప్రవేశాల పథకానికి సంబంధించి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తికావడంతో ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ ప్రవేశపత్రాలను అందజేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని డీడీ కార్యాలయంలో గురువారం దరఖాస్తుల పరిశీలన చేపట్టగా, వంద మందికి గాను 84 మంది విద్యార్థులు హాజరయ్యారు.

వీరి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఇతర ధ్రువపత్రాలను పరిశీలించాక కోరుకున్న కళాశాలల్లో ప్రవేశానికి అనుమతిస్తూ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీడీ సత్యనారాయణ మాట్లాడుతూ పేద విద్యార్థులను ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్పొరేట్‌ కళాశాలల పథకాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ సంక్షేమ అధికారులు శ్రీలత, కె.వెంకటేశ్వరరావు, ఉద్యోగులు హన్మంతరావు, మురళీకృష్ణ, ఆర్‌వీఆర్‌.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

# Tag

#Tags