Polytechnic new 2courses news: ఇకనుంచి పాలిటెక్నిక్‌లో రెండు కొత్త కోర్సులు

Polytechnic New Courses

చంద్రగిరి: మండల పరిధిలోని అగరాల సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి విద్యార్థులకు మరో రెండు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రిన్సిపల్‌ సుకుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

AP Telangana 2Day School Holidays: Click Here

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఓటీ), కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌(క్యాడ్‌)లను తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ కోర్సులలో చేరుందుకు ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీటెక్‌, ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కోర్సులను చంద్రగిరి పాలిటెక్నిక్‌ కళాశాలలో రాష్ట్ర బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కోర్సు పూర్తి అయిన తర్వాత స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, ట్రైనింగ్‌ తరఫున సర్టిఫికెట్‌ను అందిస్తాన్నారు. ఈ సర్టిఫికెట్‌ కోర్సుకు ఫీజు రూ.1500 చెల్లించాల్సి ఉంటుందని, వివరాలకు ఫణికుమార్‌ 80745 30468, డాక్టర్‌ ప్రకాష్‌ 70132 99609 నంబర్లలో సంప్రదించాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

#Tags