Admissions Into PG Course: వైవీయూ PG కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సులలో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు నేరుగా అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు యోగి వేమన విశ్వ విద్యాలయం ప్రవేశాల సంచాలకులు డా. లక్ష్మి ప్రసాద్ తెలిపారు.
ఇకనుంచి ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు: Click Here
ప్రవేశానికి ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, 2 సెట్ల జిరాక్స్ కాపీలు, నిర్ణీత ఫీజుతో విశ్వ విద్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రాంగణంలో వున్న ప్రవేశాల సంచాలకుల కార్యాలయం. (డీవోఏ)లో హాజరు కావాలని సూచించారు. ఏపీపీజీసెట్– 2024 ఎంట్రన్స్ రాసి అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులన్నారు. వివరాలకు yvu.edu.in ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం,ఎంపీఈడీ సబ్జెక్టుల వారీగా ఖాళీల ఉన్నాయని వివరించారు.
ఖాళీలు వివరాలు ఇలా..
ఇంగ్లీషు–35, తెలుగు –39, ఉర్దూ –26, జర్నలిజం–33, హిస్టరీ– 29, పొలిటికల్ సైన్స్– 26, ఎకనామిక్స్–41, కామర్స్ –37, బయో కెమిస్ట్రీ– 21, బయోటెక్నాలజీ –05, మైక్రో బయాలజీ –05, జెనెటిక్స్ సెండ్ జీనోమిక్స్–29, ఎన్విరాన్మెంటల్ సైన్స్ –31, బోటనీ –16, జువాలజి–06, మ్యాథ్స్ –38, ఫిజిక్స్–26, మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ –34, కెమిస్ట్రీ –9, జియాలజీ –26, సైకాలజీ –24; ఫిజికల్ ఎడ్యుకేషన్ –38, ఫుడ్ టెక్నాలజీ –22; కంప్యూటర్ సైన్స్ –13, కాంపిటేషనల్ డేటా సైన్స్–27ఖాళీలు ఉన్నాయని ప్రవేశల సంచాలకులు తెలిపారు.