Diet College: ఎన్ఐఆర్ఎఫ్ ఇన్నోవేష‌న్ ర్యాంకింగ్ లో డైట్ క‌ళాశాల..

విశ్వ‌విద్యాల‌యాలు, క‌ళాశాల‌ల‌తో పోటీ ప‌డ‌గా స్వ‌యం ప్ర‌తిప‌త్తి హోదాను గెలిచి, ప్రతిష్టాత్మ‌క స్థానాన్ని త‌క్కించుకుంది డైట్ క‌ళాశాల‌. ఈ సంద‌ర్భంగా క‌ళాశాల చైర్మ‌న్ మాట్లాడుతూ..
Diet college Chairman response on the top rank of college

సాక్షి ఎడ్యుకేష‌న్: స్థానిక డైట్‌ కళాశాలకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి పదేళ్ల పాటు యూజీసీ (2032–33) నుంచి స్వయం ప్రతిపత్తి హోదా దక్కిందని కళాశాల చైర్మన్‌ దాడి రత్నాకర్‌ తెలిపారు. స్థానిక కళాశాల ఆవరణలో గురువారం ఆయన మాట్లాడారు.

Teacher's TET Exams: టెట్ అర్హ‌తపై ప‌రిశీల‌న‌.. మ‌రో మూడేళ్ల‌లో..?

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ఇన్నోవేషన్‌ ర్యాంకింగ్‌కు 5,543 విశ్వవిద్యాలయాలు, కళాశాలలు పోటీపడగా, అందులో డైట్‌ కళాశాల ప్రతిష్టాత్మకమైన 151–300 బ్యాండ్‌ ర్యాంకింగ్‌లో స్థానం సంపాదించుకుందన్నారు. ఈసీఈ, సీఎస్‌ఈ విభాగాల్లో జేఎన్‌టీయూ రీసెర్చ్‌ సెంటర్‌ అనుమతి లభించిందన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.వైకుంఠరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఈశ్వరరావు పాల్గొన్నారు.

#Tags