Degree Exams: డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఎప్పుడంటే..

Degree Exams

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ఈ నెల 17న ఇన్‌స్టంట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ జీవీ రమణ తెలిపారు. నగరంలోని కేఎస్‌ఎన్‌ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డిగ్రీ ఐదు, ఆరో సెమిస్టర్‌లో ఏదైనా ఒక్క సబ్జెక్టు ఫెయిలైన వారు మాత్రమే ఇన్‌స్టంట్‌ పరీక్ష రాయడానికి అర్హులని తెలిపారు. ఈ నెల 11లోపు పరీక్ష ఫీజు కట్టడానికి చివరి తేదీ అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు.

#Tags