Degree Admissions: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు..వెబ్‌ ఆప్షన్లకు చివరి తేదీ ఇదే

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల ఐదో తేదీ వరకూ వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రామచంద్ర ఆర్‌కే గురువారం తెలిపారు.

వెబ్‌ ఆప్షన్లలో మార్పులకు 6న అవకాశం ఉందన్నారు. ఏ కళాశాలలో ఏ విభాగంలో సీటు కేటాయించారో విద్యార్థులకు ఈ నెల 10వ తేదీన తెలియజేస్తారన్నారు.

ECIL Hyderabad Recruitment: ఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

వారందరూ 12 నుంచి 16వ తేదీలోపు తమకు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్‌ చేయాలన్నారు. వెబ్‌ ఆప్షన్ల నమోదులో ఎటువంటి సందేహాలున్నా ఆర్ట్స్‌ కళాశాల సెమినార్‌ హాలులో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
 

#Tags