Dasara Holidays 2023 For Colleges : నేటి నుంచి ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?
సెలవుల సమయంలో కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించకుండా చూసుకోవాలని జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కళాశాల తిరిగి అక్టోబర్ 26న పునః ప్రారంభం కానున్నాయి.
అలాగే ఏపీ కూడా నేటి నుంచి..
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు దసరా సెలవులను ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటించింది. ఒకవేళ దసరా సెలవుల్లో జూనియర్ కాలేజీలు తెరిస్తే గుర్తింపు రద్దుకు ప్రభుత్వానికి సిఫార్స్ చేస్తామని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు జి. సీతారాం, ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి రాయల సత్యనారాయణ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే కాలేజీల గుర్తింపు రద్దు చేయడంతో పాటు, యాజమాన్యానికి రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆర్‌ఐవో స్పష్టం చేశారు. సమస్యలుంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 9392911802, 0891– 2552854కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
దసరా సెలవుల్లో మార్పులు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ విద్యాశాఖ దసరా సెలవులు ప్రకటించించిన విషయం తెల్సిందే. మొత్తం 11 రోజులు పాటు దసరా సెలవులు స్కూల్స్ ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులలో మార్పు చేసింది. అయితే గతంలో ప్రకటించిన సెలవుల్లో ప్రభుత్వం స్వల్ప మార్పు చేసింది. అక్టోబర్ 23 తో పాటు 24వ తేదీన కూడా సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దసరా సెలవులు అధికారికంగా అక్టోబర్ 23, 24వ తేదీల్లో ప్రకటించినట్లు అయింది.
తెలంగాణలో స్కూల్స్‌కు..
దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా 13 రోజుల దసరా సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్కూల్స్ లకు సెలవులు ఇవ్వడంతోపాటు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మిగితా పండగల సెలవులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా దసరా తర్వాత వచ్చే దీపావళి పండగకు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చింది.