Colleges Sankranti Holidays 2025 : శుభవార్త.. కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటన.. మొత్తం ఎన్ని రోజులంటే...?
తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పండగకు దేశ నలుమూలల నుంచి సొంతూళ్లకు వెళ్లీ సంతోషంగా ఈ పండగను జరుపుకుంటారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూల్స్, కాలేజీలకు సంక్రాంతి పండగకు సెలవులు కూడా ప్రకటించారు.
మొత్తం ఎన్ని రోజులంటే..?
తెలంగాణ ఇంటర్ బోర్డ్ తాజాగా జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇంటర్ కాలేజీలకు ఈ సెలవులను మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. తిరిగి ఈ కాలేజీలు 17వ తేదీన ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే జనవరి 11వ తేదీన (రెండో శనివారం), 12వ తేదీన (ఆదివారం) కావడంతో మొత్తంగా ఆరు రోజుల పాటు సెలవులు లభించాయి.
ఈ సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే..
సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కాలేజీలలో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఒక వేళ క్లాసులు నిర్వహిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు తెలిపింది.
జనవరి నుంచి డిసెంబర్ 2025 వరకు సెలవులు ఇవే :
జనవరి 2025 :
➤☛ భోగి – 13
➤☛ సంక్రాంతి – 14
➤☛ రిపబ్లిక్ డే – 26
ఫిబ్రవరి 2025 :
➤☛ మహ శివరాత్రి – 26
మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31
ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18
జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07
జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06
ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27
సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05
అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20
నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05
డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
Inter Colleges Sankranti Holidays 2025 Details ఇవే..