RGUKT- idupulapaya Campus admissions 2024: నేటి నుంచి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ
వేంపల్లె: ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామిగుప్తా తెలిపారు. ఉదయం 9 గంటలకు క్యాంపస్‌లోని సెంట్రల్ లైబ్రరీలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈనెల 11న రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అధికారులు ఎంపిక జాబితా విడుదల చేశారు. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ కి సంబంధించి ఈనెల 22, 23 తేదీలలో ఎంపికై న విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ కి సంబంధించి ఈనెల 24, 25 తేదీలలో ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు.
ఈ ప్రక్రియకు కావలసిన అన్ని ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించి పూర్తి చేశారు. కాగా ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ విద్యా బోధనలో భాగంగా ఆహ్లాదకరమైన వాతావరణం, నాణ్యమైన ఉత్తమ విద్యాబోధన, క్రమశిక్షణ, ఉత్తమ సామాజిక స్పృహ ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ సొంతం. విద్యతో పాటు విద్యార్థుల మానసిక శారీరక వికాసానికి ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, క్రీడలు, శాసీ్త్రయ సంగీతం, నాట్యం, యోగా వంటి ఒకేషనల్ కోర్సులు ఇక్కడ ప్రత్యేక వీటిల్లో నిత్యం ప్రత్యేకత. వీటిల్లో నిత్యం అధ్యాపక బృందాలు శిక్షణ ఇస్తారు.
ఇదీ చదవండి: Telangana Job Calendar 2024:అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జాబ్ కేలండర్ ప్రకటిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
రెండ్రోజుల్లో 1,100 మందికి కౌన్సెలింగ్
ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో భాగం గా రెండు రోజుల్లో 1100 మందికి కౌన్సెలింగ్ నిర్వ హించనున్నారు. అభ్యర్థులందరికీ ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికారులు కాల్ లెటర్లు పంపించారు.
కౌన్సెలింగ్ కు అవసరమైనవి
పదోతరగతి హాల్ టికెట్, పదో తరగతి గ్రేడ్ షీట్, పదో తరగతి టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫి కెట్ (4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), మీసేవా కేంద్రం నుంచి తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, ఈ ఏడాది ఏప్రిల్ తరువాత మీ సేవా కేంద్రం ద్వారా తీసుకున్న ఆదాయ ధృవపత్రం, అభ్యర్థి, అతని తల్లిదండ్రుల రెండు పాసుపోర్టు ఫొటోలు, రేషన్ కార్డు, అభ్యర్థి ఆధార్ కార్డు,విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు లోన్ అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు,అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఐడెంటీకార్డు, శాలరీ సర్టిఫికెట్, అభ్యర్థి తండ్రి పాన్ కార్డు,ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు తెచ్చుకోవాలి.