TSMJBC: అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

సుభాష్‌నగర్‌: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో అతిథి అ ధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు ఆర్‌సీవో సత్యనాథ్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు.
అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

జూలై 6లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. తెలుగు, ఇంగ్లిష్‌, పొలిటికల్‌ సైన్స్‌, చరిత్ర, ఎకనామిక్స్‌, కామర్స్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బొటనీ, జువాలజీ, స్టాస్టిక్స్‌, నూట్రిషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌తో పీజీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పీహెచ్‌డీ, ఎంఫిల్‌, నెట్‌, సెట్‌ ఎస్‌ఎల్‌ఈటీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఓపెన్‌ కేటగిరి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55శాతం మార్కులు పొంది ఉండాలని సూచించారు. డిగ్రీ, పీజీ కళాశాలల్లో పని చేసిన అనుభవాలను మాత్రమే పరిగణిస్తామని, సర్వీస్‌ సర్టిఫికెట్లు జత పర్చాలన్నారు.

కళాశాల, సబ్జెక్టు అవ సరాలను బట్టి మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను డెమో, ఇంటర్వ్యూకు పిలుస్తామని చెప్పారు. దరఖాస్తులను ఆర్‌సీఓ కార్యాలయం, మునిపల్లిలోని ఎంజేపీ డిగ్రీ కళాశాల, జంగంపల్లిలోని ఎంజేపీ పాఠశాలల్లో పొందవచ్చన్నారు. ఉమ్మ డి జిల్లాలో మునిపల్లి, నిజామాబాద్‌, కామారెడ్డిలో డిగ్రీ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఆర్‌సీవో కార్యాలయంలో, ఎంజేపీ డిగ్రీ కళాశాలలో సమర్పించాలని సూచించారు. వివరాలకు 79817 10647, 6302342448 (ఆర్‌సీవో కార్యాలయం), 9989353153 (జంగంపల్లి ప్రిన్సిపాల్‌), 9948559189 (విజయ్‌కుమార్‌ ప్రిన్సిపాల్‌)ను సంప్రదించాలని సూచించారు.

చదవండి:

TSPSC Group IV Exam: 2,878 పరీక్ష కేంద్రాలు... 39,600 మంది ఇన్విజిలేటర్లు.. టీఎస్‌పీఎస్సీ సూచనలు ఇవే

Engineering: కౌన్సెలింగ్‌లో తగ్గిన సీట్లు.. ఆ సీట్లు ఏమైనట్టు?

NCERT: 8వ తరగతి సిలబస్‌ తగ్గింపు.. తొలగించిన‌ చాప్టర్లు ఇవే

#Tags