Dr VS Alagu Varshini: ప్రతి గురుకులంలో టెలిఫోన్‌!.. విద్యార్థి నేరుగా కార్యదర్శితో మాట్లాడొచ్చు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలోని ప్రతి పాఠశాలలో ప్రత్యేకంగా టెలిఫోన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి వీ.ఎస్‌.అలగు వర్షిణి తెలిపారు.

ఈ ఫోన్‌ ద్వారా నేరుగా సొసైటీ కార్యదర్శి అపాయింట్‌మెంట్‌ తీసుకుని నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుందని వివరించారు. వారంలోగా పది పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు చెప్పారు.  ఆ తర్వాత అన్ని పాఠశాలల్లోనూ టెలిఫోన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఈ విధానంతో పాఠశాల స్థాయిలో సమస్యలు మొద లు ఇతర అంశాలన్నీ నేరుగా సొసైటీ కార్యదర్శి కార్యాలయానికి చేరుతాయని, ఇలా వచ్చిన అంశాలపై యుద్ధ ప్రాతిపదికన స్పందించి చర్యలు తీసుకునే వీలుంటుందన్నారు. టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ ఎస్‌ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంత రం చేపడుతున్న కార్యక్రమాలను వర్షిణి జూలై 12న‌ ‘సాక్షి’కి వివరించారు. అవి ఆమె మాటల్లోనే.. 

చదవండి: Transfer of Employees: ‘GHMC’ని ఒకే స్టేషన్‌గా పరిగణిస్తాం.. ఇలా చేసై తీవ్ర నష్టమంటున్న ఉద్యోగులు

మెరిట్‌ ఆధారంగానే అడ్మిషన్లు... 

గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకే ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పటికే అర్హత పరీక్ష రాసిన వారిలో మెరిట్‌ ఆధారంగా అవకాశం కల్పిస్తున్నాం. పరీక్షకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.

రీజినల్‌ కోఆర్డినేటర్, ప్రిన్స్‌పల్‌ స్థాయిలో అడ్మిషన్లను ఎట్టి పరిస్థితిలోనూ చేపట్టవద్దని ఆదేశించాం. కొందరు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అలాంటి వారిని ఏమాత్రం సహించం. అలాంటి వారిపైన తల్లిదండ్రులు సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. 

చదవండి: Osmania University: పీజీలో ఈ విద్యార్థులకు వన్‌ టైం చాన్స్‌.. ఫీజు చెల్లింపు చివ‌రి తేదీ ఇదే..

19, 20 తేదీల్లో కొత్త టీచర్లకు పోస్టింగ్‌లు 

ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో దాదాపు 1200 మందికి పదోన్నతులు ఇచ్చాం. ప్రస్తుతం టీచర్ల బదిలీ ప్రక్రియ సాగుతోంది. ఈనెల 18 తేదీ కల్లా బదిలీలను పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.

జూలై 19, 20 తేదీల్లో కొత్తగా ఉద్యోగాలు సాధించిన టీచర్లకు పోస్టింగ్‌ ఇస్తాం. అన్ని కేటగిరీల్లో కలిపి 1452 మంది టీచర్లు కొత్తగా సొసైటీలో ఉద్యోగాల్లో చేరనున్నారు. 

క్రమం తప్పకుండా కాస్మోటిక్‌ చార్జీలిచ్చేలా..  

ప్రతి గురుకుల పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా కార్యాచరణ రూపొందించాం. పాఠశాలల్లో తరగతి గదులు, టాయిలెట్స్, డార్మిటరీ, కిచెన్‌లను పరిశుభ్రంగా నిర్వహించేలా ప్రత్యేకంగా శానిటేషన్‌ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నాం, జిల్లా స్థాయిలో వీటిని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసేలా ఆదే శాలిస్తాం.

మహిళా సంఘాలకు పాఠశాల స్థాయిలో కుకింగ్, శానిటేషన్‌ కాంట్రాక్టు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. విద్యార్థులకు క్రమం తప్పకుండా కాస్మోటిక్‌ చార్జీలు అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుటాం. 

#Tags