Kakatiya University: చదివింది ఓ కోర్సు.. ఇచ్చింది మరో కోర్సు
వాస్తవంగా బీకాం కంప్యూటర్ అప్లికేషన్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు బీకాం సీఏ (కంప్యూటర్ అప్లికేషన్ )అని సర్టిఫికెట్లు జారీచేయాల్సింటుంది. కొన్నేళ్లుగా ఇలాగే ఇస్తున్నారు. అయితే విద్యార్థులు కూడా గమనించడం లేదు. ఓ విద్యార్థి బీకాం కంప్యూటర్స్ డిగ్రీ కోర్సు పూర్తి చేసి ఇటీవల విదేశాలకు వెళ్లేందుకు యత్నించాడు.
అతడి సర్టిఫికెట్లను పరిశీలించగా అసలు విషయం తెలియడంతో ఇటీవల ఆ విద్యార్థి ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిని కలిసి తాను బీకాం కంప్యూటర్ అప్లికేషన్ కోర్సు పూర్తిచేస్తే తనకు కేవలం బీకాం అని మాత్రమే సర్టిఫికెట్లలో ఉందని, తనకు బీకాం కంప్యూటర్స్ అప్లికేషన్ ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో తాను నష్టపోయే పరిస్థితి ఉంటుందని తెలిపారు.
చదవండి: Goodnight Killers: గురుకులంలో ‘గుడ్‌నైట్ కిల్లర్స్’
చదివిన కోర్సు కాకుండా మరోసర్టిఫికెట్ ఇస్తే ఎలా అని ప్రశ్నించారని సమాచారం. దీంతో పరిశీలించిన ప్రిన్సిపాల్ జ్యోతి వాస్తవమేనని వెల్లడికావడంతో త్వరలోనే మార్చి ఇస్తామని ఆ విద్యార్థికి తెలిపారు.
సొంతంగానే పరీక్షల నిర్వహణ..
ఆర్ట్స్ కాలేజీ అటానమస్‌గా ఏర్పాటైనప్పటి నుంచి పరీక్షలు సొంతంగా ఆ కాలేజీ అధికారులే నిర్వహిస్తున్నారు. సర్టిఫికెట్లు కూడా ఆ కాలేజీ పరీక్షల విభాగం నుంచే జారీచేస్తూ వస్తున్నారు. కొన్నినెలల క్రితమే ప్రిన్సిపాల్‌గా జ్యోతి బాధ్యతలు చేపట్టారు.
కొన్నేళ్లుగా ఈ విధంగానే సర్టిఫికెట్లు జారీచేసినట్లు గుర్తించినట్లు సమాచారం. అయితే కాన్వకేషన్ సర్టిఫికెట్లు మాత్రం కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగం ఇస్తుంది. అందులో ఏమని పేర్కొంటున్నారనేది వెంటనే తెలియరాలేదు. దీనిపై ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ జ్యోతిని వివరణ కోరగా బీకాం జనరల్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు వేర్వేరుగా ఉంటాయన్నారు.
బీకాం కంప్యూటర్ కోర్సు పూర్తిచేసిన వారికి బీకాం సీఏ అని సర్టిఫికెట్లు జారీచేయాల్సింటుందన్నారు. అయితే మూడేళ్లకుపైగానే ఇలా సర్టిఫికెట్లు మార్చి ఇస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా జరగుతుందనే విషయం పరిశీలించి ఆయా విద్యార్థులకు సర్టిఫికెట్లు మార్చి ఇస్తామని వివరణ ఇచ్చారు.