School and Colleges Bandh on 2024 July 4th : నీట్ ఎఫెక్ట్‌.. జూలై 4వ తేదీన అన్ని విద్యాసంస్థలు బంద్‌.. ఇంకా ఇవి కూడా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీ (గురువారం) అన్ని విద్యాసంస్థలకు బంద్ కు పిలుపునిచ్చారు విద్యార్థి సంఘాల నాయకులు. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఎల్బీజీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి సీహెచ్‌ వినోద్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రాజశేఖర్‌ వివరాలు వెల్లడించారు. బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు.  అలాగే నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ బంద్ కార‌ణంగా జూలై 4వ తేదీన‌ తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌లోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ సూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఇచ్చు అవ‌కాశం ఉంది.

ప్రభుత్వ పాఠశాలల మూసివేతను..

కేంద్రం నిర్వాకం వలన లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపాలని, ఐఐటి ప్రవేశాల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలని, యూనివర్సిటీల్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని, విద్యార్థులు, విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని కోరుతూ బంద్‌ చేస్తున్నామన్నారు.

☛ July Month Holidays 2024 : జూలై నెల‌లో స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే సెల‌వులు ఇవే..!
 
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భారత్ బంద్‌కు పిలుపు.. : 

అలాగే నీట్‌ లీకేజీకి నిరసనగా.. గురువారం విద్యాసంస్థల భారత్‌ బంద్ ఉంటుంది విద్యార్థి సంఘం నాయ‌కుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. అలాగే బల్మూరి వెంకట్ మాట్లాడుతూ..కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌పై ఈ బాధ్యత ఉంద‌న్నారు. మోదీపై ఒత్తిడి తెచ్చి నీట్‌ పరీక్షను రద్దు చేయాలి డిమాండ్ చేశారు.అలాగే పేపర్‌ లీకేజీ చట్టాలను కఠినంగా అమలు చేయాల‌న్నారు. నీట్‌ లీకేజీతో పాటు.. మిగతా పరీక్షలపై కూడా అనుమానం కలుగుతోంద‌ని వెంకట్ అన్నారు.

➤ July 17th Holiday 2024 : జూలై 17వ తేదీన‌ స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు.. ఎందుకంటే..?

#Tags