School Academic Holiday Calendar 2023-24 : ఈ ఏడాది స్కూల్స్ అకాడమిక్ కాలెండర్ ఇదే.. దసరా, సంక్రాంతితో పాటు ఇత‌ర సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో స్కూల్స్ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే తెలంగాణ విద్యాశాఖ మాత్రం అప్పుడే ఈ ఏడాది విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు చేసింది. 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ విడుదల చేసింది.
Telangana School Academic Holiday Calendar 2023-24

ముందుగా ప్రకటించినట్లుగానే.. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అలాగే.. వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి పనిదినంగా నిర్ణయించింది.  అలాగే సెల‌వుల వివ‌రాలు కూడా ప్ర‌క‌టించింది.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ 

2023-24 అకడమిక్‌ ఇయర్ పూర్తి వివ‌రాలు ఇవే..
☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు  పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి 
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.

☛ Summer Holidays Extended 2023 : గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు పొడిగింపు.. కార‌ణం ఇదే.. మొత్తం ఎన్ని రోజులంటే..? అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా..

#Tags