Tribal University: ట్రైబల్ వర్సిటీలో చేరేందుకు అనాసక్తి
అడ్మిషన్లకు చివరి రోజు వరకు ముగ్గురే చేరగా.. స్పాట్ అడ్మిషన్ రోజున 10 మంది అర్హత సాధించారు. మొత్తం 13 మందికి గాను ఐదుగురు బీఏ ఎకనామిక్స్‌లో, ఎనిమిది మంది బీఏ ఇంగ్లిష్‌లో సీట్లు పొందారు. 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఎస్‌ఎస్‌సీటీయూ తన కార్యకలాపాలను ప్రారంభించింది.
చదవండి: Tribal Univeristy: విశ్వవిద్యాలయాలతో ఆదివాసి, గిరిజనులకు మేలు
సెప్టెంబర్ 20న బీఏ (హానర్స్) ఇంగ్లిష్, బీఏ (హానర్స్) ఎకనామిక్స్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1న అడ్మిషన్ కౌన్సెలింగ్ ముగియగా, కేవలం మూడు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
అక్టోబర్ 3న స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ చేపట్టారు. రెండు కోర్సులలో 47 సీట్లకుగాను 13 సీట్లే భర్తీ అయ్యాయని, దీంతో అడ్మిషన్ల గడువు అక్టోబర్ 11వ తేదీ వరకు కొనసాగుతుందని ఎస్‌ఎస్‌సీటీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోరిక తుకారాం చెప్పారు. 14వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు.