DEO Ashok: విద్యార్థుల్లో పరిశీలన శక్తి పెంపొందించాలి

కాగజ్‌నగర్‌టౌన్‌: విద్యార్థుల్లో పరిశీలన శక్తి పెంపొందించాలని డీఈవో అశోక్‌ అన్నారు. కాగజ్‌నగర్‌లోని ఫాతిమా కాన్వెంట్‌ ఉన్నత పాఠశాలలో న‌వంబ‌ర్ 10న‌ 31వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ఘనంగా నిర్వహించారు.

మొత్తం 114 ప్రాజెక్టులు ప్రదర్శించగా, 228 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ‘ఆరోగ్యం, శ్రేయస్సు కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం’ అనే అంశంపై ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందిచడం, ప్రకృతిని నిశితంగా పరిశీలించడం, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడం వంటి ఉన్నత లక్ష్యాలతో జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

చదవండి: Child Rights Commission: పాఠశాల యాజమాన్యంపై కమిషన్‌ ఆగ్రహం

అనంతరం న్యాయ నిర్ణేతలు రాష్ట్రస్థాయికి నాలుగు ప్రాజెక్టులకు ఎంపిక చేశారు. విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కటకం మధుకర్‌, జిల్లా అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ మామిడాల తిరుపతయ్య, పరీక్షల సహాయ కమిషనర్‌ ఉదయ్‌బాబు, సమగ్రశిక్ష కోఆర్డినేటర్‌ అబీద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

#Tags