Scholarships: 21 వేల మంది విద్యార్థినులకు ఈ ఉపకార వేతనాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ వజ్ర స్వర్ణాభరణాల తయారీ విక్రయ సంస్థ మలబార్‌ గ్రూప్‌ దేశవ్యాప్తంగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద 21 వేలమంది విద్యార్థినులకు 2024 ఏడాదికి గాను రూ.16కోట్ల ఉపకారవేతనాలను ప్రకటించింది.

ఇటీవల ముంబైలోని భారత్‌ డైమండ్‌ బౌర్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్, మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపీ అహ్మద్, మలబార్‌ గ్రూప్‌ ఎండీ (భారత్‌) ఆషర్‌ ఓ, సంస్థ వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ సలామ్‌ కేపీ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Scholarship Program: పీఎం స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం.. ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి

ఈ సందర్భంగా ఎంపీ అహ్మద్‌ మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చగలిగే చోదక శక్తి కేవలం విద్య మాత్రమేనన్నారు. విద్యలో బాలికలు ప్రతిభ కనబరుస్తూ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోకుండా ఉండేందుకు కొంతైనా సాయపడాలనే ఈ ఉపకారవేతనాలను ప్రకటించామని చెప్పారు. బాలికలు చదువులో రాణించడం ద్వారా మహిళా సాధికారతను సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. 

#Tags