July and August School Holidays 2023 list : ఈ నెల జూలై, వచ్చే నెల ఆగస్టులో స్కూల్స్‌కు భారీగా సెలవులు.. ఎందుకంటే..?
కొన్నింటికి ప్రతి వారం రెండు రోజులు సెలవులు ఉంటాయి. మరికొన్నింటికి తక్కువ సెలవులు ఉంటాయి. ప్లేగ్రూప్ స్కూళ్లకు మరిన్ని సెలవులు ఉండవచ్చు. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగకు స్టేట్ హాలిడే సైతం ఇస్తోంది.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
జులైలో కచ్చితమైన సెలవుల గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత స్కూల్ హాలిడే షెడ్యూల్‌ను చెక్ చేయవచ్చు. ఈ నేపథ్యంలో జులై, ఆగస్టు నెలల్లో పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.
జూలై నెలలో సెలవుల వివరాలు ఇవే..
జులై 8వ తేదీ శనివారం.. నెలలో రెండవ శనివారం.. పాఠశాలకు సెలవు. జులై 9 ఆదివారం కాబట్టి ఈరోజు కూడా పాఠశాలలకు సాధారణంగానే సెలవు ఉంటుంది. జులై 15 వతేదీ రెండో శనివారం.. కాబట్టి పాఠశాలలకు సెలవు. జులై 16 ఆదివారం. అలాగే జులై 22వ తేదీ శనివారం ఫోర్త్ సాటర్డే. ఈ రోజు చాలా స్కూళ్లకు సెలవులు ఇస్తారు. జులై 23వ తేదీ ఆదివారం. జులై 28వ తేదీ (శుక్రవారం) మొహర్రం పండగ ఉంది.. కాబట్టి పాఠశాలలకు సెలవు ఉండే అవకాశం ఉంటుంది . అలాగే జులై 29వ తేదీ శనివారం కూడా మొహర్రం జరుపుకుంటారు. జులై 30వ తేదీన ఆదివారం పాఠశాలకు హాలిడే. దీంతో కొన్ని పాఠశాలలకు వరుసగా మూడు రోజుల పాటు సెలవు ఉండవచ్చు. అలాగే ప్రస్తుతం వర్షాకాలంలో భారీ వర్షాల కారణంతో కూడా కొన్ని కొన్ని స్కూల్స్‌కు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.
☛ ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
ఆగస్టు నెలలో స్కూల్స్‌కు సెలవుల వివరాలు ఇలా..
ఆగస్టు 5వ తేదీన శనివారం, కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు. ఆగస్టు 6వ తేదీ ఆదివారం కాబట్టి స్కూల్స్‌కి సాధారణంగా సెలవు ఉంటుంది. ఆగస్టు 12 నెలలో రెండవ శనివారం స్కూల్స్‌కు సెలవు. ఆగస్టు 13 ఆదివారం సెలవు ఉంటుంది. ఆగస్టు 15వ తేదీ (మంగళవారం) స్వాతంత్య దినోత్సవం సందర్భంగా పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ఉంటుంది. ఆగస్టు 16, పార్సీ న్యూ ఇయర్, కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు. ఆగస్టు 20వ తేదీ ఆదివారం హాలిడే. ఆగస్టు 27వ తేదీ ఆదివారం. ఆగస్టు 29వ తేదీ ఓనం, కొన్ని పాఠశాలలకు సెలవు ఉండవచ్చు. ఆగస్టు 30వ తేదీ(బుధవారం) రక్షా బంధన్ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఇస్తారు. అయితే విద్యార్థులు నివసిస్తున్న రాష్ట్రం లేదా ప్రాంతంను బట్టి పైన పాఠశాలను సెలవులు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు.
గమనిక : ఈ స్కూల్స్ సెలవుల పూర్తి సమాచారంను పాఠశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోవాలి.
జూలై బ్యాంక్‌లకు 15 రోజులు పాటు సెలవులు..
జూలై నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. ఇందులో రెండు, నాలుగవ శనివారాలు, ఆదివారాలతో పాటు ఇతర సెలవులున్నాయి. కొన్ని సెలవులు జాతీయ సెలవులైతే మరికొన్ని ప్రాంతీయ సెలవులుంటాయి. ప్రాంతీయ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి.
జూలై 2023 బ్యాంకు సెలవులు :
జూలై 4 ఆదివారం సెలవు
జూలై 5 గురు గోవింద్ జయంతి-జమ్ము, శ్రీనగర్‌లో సెలవు
జూలై 6 మిజోరాంలో ఎంహెచ్ఐపీ సెలవు
జూలై 8 రెండవ శనివారం
జూలై 9 ఆదివారం
జూలై 11 త్రిపురలో కేరా పూజా సందర్భంగా సెలవు
జూలై 13 సిక్కింలో భాను జయంతి సెలవు
జూలై 16 ఆదివారం
జూలై 17 మేఘాలయలో యూ తిరోట్ సింగ్ డే
జూలై 22 నాలుగవ శనివారం
జూలై 23 ఆదివారం
జూలై 29 మొహర్రం
జూలై 30 ఆదివారం
జూలై 31 హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో షహాదత్ సెలవు
తెలంగాణలో 2023-24 అకడమిక్ ఇయర్‌లో పరీక్షలు- సెలవులు ఇవే..
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.
ఆంధ్రప్రదేశ్ స్కూల్ అకడమిక్ క్యాలెండర్, సెలవుల(2023–24) పూర్తి వివరాలు ఇవే..
జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ స్కూల్ అకడమిక్ క్యాలెండర్ 2023–24ను విడుదల చేశారు. స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్ మేళా, లాంగ్వేజ్ క్లబ్, లాంగ్వేజ్ ల్యాబ్స్, లెసన్ ప్లాన్ ఫార్మాట్ అండ్ గైడ్‌లైన్స్, లెర్న్ ఏ వర్డ్ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు.
ఏపీలో ఈ ఏడాది (2023-24) సెలవులు ఇలా..
☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు క్రిస్టమస్ సెలవులు (మిషనరీ స్కూల్స్‌కు మాత్రమే..)
☛ ఇంకా దీపావళి, ఉగాది, రంజాన్ మొదలైన పండగలకు ఆ రోజును బట్టి సెలవులు ఇవ్వనున్నారు.
చదవండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్ అర్హతగా జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల వివరాలు ఇవే..