FAST India: ఇండియా సైన్స్‌ ఫెస్టివల్‌కు వేదికగా హైదరాబాద్‌

సనత్‌నగర్‌ (హైదరాబాద్‌): India Science Festival (ISF)కు హైదరాబాద్‌ వేదిక కానుంది.
ఇండియా సైన్స్‌ ఫెస్టివల్‌కు వేదికగా హైదరాబాద్‌

Foundation For Advancing Science And Technology (FAST India) ఆధ్వర్యంలో జనవరి 20 నుంచి 22 వరకు బేగంపేట హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఈ ఫెస్టివల్‌ నాలుగో ఎడిషన్‌ జరగనుంది. నవంబర్‌ 16న దీనికి సంబంధించిన బ్రోచర్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల వేదికగా హైదరాబాద్‌ రూపుదిద్దుకుందన్నారు.

చదవండి: శాస్త్ర, సాంకేతికతలే చోదక శక్తి: నరేంద్ర మోదీ

ప్రభుత్వం నుంచి ఆయా రంగాలకు సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ఫాస్ట్‌ ఇండియా సీఈఓ జయంత్‌ కృష్ణ మాట్లాడుతూ ‘ఫ్యూచర్‌ ఈజ్‌ నౌ’నేపథ్యంలో జరిగే ఇండియా సైన్స్‌ ఫెస్టివల్‌కు ప్రపంచస్థాయి వక్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, రచయితలు, కళాకారులతో పాటు వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సైన్స్‌పై చర్చలు, ప్రదర్శనలు, పిల్లలకు వర్క్‌షాప్‌లు, పాలసీ రౌండ్‌టేబుల్స్, పుస్తక ఆవిష్కరణలు, ఫిల్మ్‌ స్క్రీనింగ్‌లు, పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్రవ్యాప్త పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

చదవండి: UGC: వర్సిటీలో బోధనకు అన్ని రంగాలకు చాన్స్‌

#Tags