Helping Hands Association: వైద్య విద్యార్థినికి చేయూత

సాక్షి, హైదరాబాద్‌: నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని జి.సంజనకు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అసోసియేషన్‌ చేయూత అందించింది.

కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో మెడిసిన్‌ రెండో సంవత్సరం చదువుతున్న జి.సంజన ప్రియ తండ్రికి అనారోగ్యంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులతో ట్యూషన్‌ ఫీజు చెల్లించే పరిస్థితి లేదు.

చదవండి: Supreme Court Help for Student: విద్యార్థికి సాయపడేందుకు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు

ఈ నేపథ్యంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గైక్వాడ్‌ తులసీదాస్‌ మాంగ్‌ సెప్టెంబ‌ర్ 30న‌ సచివాలయంలో రూ.25 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి దేవేందర్, కోశాధికారి బి.గుణవంత్‌ రావ్‌ తదితరులు పాల్గొన్నారు.   

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags