6 Hours Duty Daily: ‘వీరికి రోజుకు 6 గంటలే పని ఉండాలి’

సాక్షి, హైదరాబాద్‌: డాక్టర్లకు రోజుకు ఆరు గంటలే పని ఉండాలని ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎఫ్‌జీడీఏ) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కిరణ్‌ మాదల కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు.

కోల్‌కతా ఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘రీవ్యాంపింగ్‌ వర్కింగ్‌ కండిషన్స్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ పర్సనల్‌’సబ్‌ కమిటీ సమావేశం సెప్టెంబ‌ర్ 13న‌ జరిగింది. ఈ సమావేశాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది.

చదవండి: Medical Colleges: వైద్య విద్య సీట్లపై ‘ప్రైవేటు’ కన్ను!.. ఇందుకోసం డీమ్డ్‌ యూనివర్సిటీలుగా మారేందుకు యత్నాలు

ఆన్‌లైన్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్న కిరణ్‌ మాదల మాట్లాడుతూ మహిళా వైద్య సిబ్బందికి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలన్నారు. డ్యూటీ ఆఫ్‌తో 24 గంటలకు బదులుగా 12 గంటల డ్యూటీ ఉండాలని కోరారు. వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే వైద్యులకు పని ఉండాలన్నారు.

#Tags