Results: డిగ్రీ ఆరో సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో ఈఏడాది ఏప్రిల్‌, మేలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీవోకేషనల్‌ కోర్సుల ఆరో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు జూలై 7న‌ సాయంత్రం రిజిస్ట్రార్‌ పి.మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ఎస్‌.నర్సింహాచారి విడుదల చేశారు.

పరీక్షలకు 46,130 మంది విద్యార్థులు హాజరుకాగా 23,114 మంది (50.10)శాతం ఉత్తీర్ణులయ్యారు. బాలురు 22,355 మంది హాజరుకాగా 8,465 మంది (37.87శాతం), బాలికలు 23,784 మంది హాజరుకాగా 14,649 మంది (61.59శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు వారు పేర్కొన్నారు.

ఉమ్మడి జిల్లాల వారీగా ఫలితాలు

కేయూ పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ల పరీక్షల ఫలితాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 18,881 మంది విద్యార్థులకుగానూ 9,657 మంది (51.15) ఉత్తీర్ణత సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11,809 మంది విద్యార్థులకుగానూ 6,352 మంది (53.79శాతం) ఉత్తీర్ణత సాధించారు.

చదవండి: B Com General Course : 17 ప్రభుత్వ కళాశాలల్లో బీకాం జనరల్‌ కోర్సుకు స్వస్తి.. విద్యాశాఖ మంత్రిపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు!

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 15,449 మంది విద్యార్థులకుగానూ 7,105 మంది (45.99శాతం) ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల ఫలితాలు సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు

డిగ్రీ ఆరో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 7నుంచి 22వరకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

#Tags