CUT UG Examination: కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో క్యూట్‌–యూజీ పరీక్ష.. పరీక్ష వ్యవధి ఇలా..

న్యూఢిల్లీ: కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల్లో దేశవ్యాప్తంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన క్యూటీ–యూజీ పరీక్ష విధానంలో యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌(యూజీసీ) కీలక మార్పులు చేసింది.

గతంలో హైబ్రిడ్‌ మోడ్‌లో పరీక్ష చేపట్టగా ఇకపై 2025 నుంచి కేవలం కంప్యూటర్‌ ఆధారిత విధానంలో  నిర్వహిస్తామని యూజీసీ మంగళవారం వెల్లడించింది. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ పలు వివరాలను పంచుకున్నారు.

చదవండి: Admissions: రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌ దరఖాస్తుల గడువు తేదీ ఇదే..

‘‘ సీయూఈటీ–యూజీ పరీక్ష రాసే అభ్యర్థులు 12వ తరగతిలో అభ్యసించిన సబ్జెక్టులతో సంబంధంలేకుండా తమకు నచ్చిన సబ్జెక్ట్‌ కోసం పరీక్ష రాసుకోవచ్చు. ఈ పరీక్షల్లో సబ్జెక్టుల్ని ఈసారి 63 నుంచి 37కు తగ్గిస్తున్నాం.   ఇప్పుడు అన్నింటికీ 60 నిమిషాల పరీక్షకాలం వ్యవధిని ఖరారుచేశాం. ఐచ్ఛిక ప్రశ్నల విధానానికి స్వస్తి పలికాం. సీయూఈటీ–పీజీ పరీక్ష వ్యవధిని 105 నిమిషాల నుంచి 90 నిమిషాలకు కుదించాం’’ అని జగదీశ్‌ కుమార్‌ చెప్పారు.   

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags