Degree Classes: మహిళా డిగ్రీ కళాశాలలోనే తరగతులు

గద్వాల అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు కొనసాగుతున్న తరగతులను జ‌నవ‌రి 10‌ నుంచి ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ సంపత్‌కుమార్‌ జ‌నవ‌రి 9న‌ ప్రకటనలో తెలిపారు.

ఈ విషయాన్ని విద్యార్థినులు గుర్తించి, మహిళా డిగ్రీ కళాశాలలో తరగతులకు హజరు కావాలని సూచించారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ తర్వాత బస్టాండ్‌ నుంచి కళాశాల వరకు ఉచిత బస్సు సర్వీస్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇందుకు సహకరించిన కలెక్టర్‌ బీఎం సంతోష్‌, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి కృతజ్ఞతలు తెలియజేశారు.

చదవండి:

APSCHE: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'AI' కోర్సులు

Degree Exams: డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు డిబార్‌

#Tags