CBSE releases Sample Question Papers: త్వరలోనే ఫైనల్ ఎగ్జామ్స్.. శాంపుల్ ప్రశ్నపత్రాలు రిలీజ్ చేసిన సీబీఎస్‌ఈ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE).. 10, 12వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ నమూనా ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్cbseacademic.nic.in. నుంచి శాంపుల్ క్వశ్చన్ పేపర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నమూనా ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా విద్యార్థులు పరీక్షలో వచ్చే ప్రశ్నలను సులభంగా అర్థం చేసుకోగలరు. ఏ విభాగం నుంచి ఎలాంటి తరహా ప్రశ్నలు వస్తాయి? ఎంత కఠినంగా క్వశ్చన్స్ పాటర్న్ ఉంటాయన్న విషయంలో విద్యార్థులకు అవగాహన వస్తుంది.
అంతేకాకుండా క్వశ్చన్ పేపర్స్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంత సమయం కేటాయిస్తున్నమనే విషయంలో అవగాహన వస్తుంది. ఈ నేపథ్యంలోనే సీబీఎస్‌ఈ ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి తాజాగా ఫైనల్ ఎగ్జామ్స్ శాంపుల్ క్వశ్చన్ పేపర్లను రిలీజ్ చేసింది.
Guest Lecturer Posts: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఇంటర్వ్యూలు
CBSE 2024-25 SAMPLE PAPERS.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
- ముందుగా cbseacademic.nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీపై కనిపించే స్కిల్ ఎడ్యుకేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి 'sample question papers' అనేల లింక్‌పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత టెన్త్/12వ తరగతి అనే క్లాస్‌ను సెలక్ట్ చేసుకోండి
- మెనూలో సబ్జెక్ట్ వారీగా నమూనా ప్రశ్నా పత్రాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
- మీకు కావల్సిన సబ్జెక్ట్‌ను సెలక్ట్ చేసుకోండి.. డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి