Remove Caste: విద్యా సంస్థల్లో కులం పదాన్ని తొలగించాలి

సాక్షి, హైదరాబాద్‌: విద్యా సంస్థల్లో కులం పదాన్ని తొలగించాలని, వివిధ రకాల గురుకులాల పేర్లను తొలగించి ఇంటిగ్రేటెడ్‌ గురుకులాలుగా మార్చాలని ఇండియన్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పాపని నాగరాజు డిమాండ్‌ చేశారు.

కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అన్ని ప్రైవేటు రంగాల్లో కూడా వర్తింపచేయాలని కోరారు. అదే విధంగా గ్రంథాలయాల ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలని, ప్రతి మండలానికి రెండు మోడల్‌ స్కూళ్లు నిర్మించాలని వెల్లడించారు.

చదవండి: Scholarship: అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి దరఖాస్తుల ఆహ్వానం

ప్రతి హాస్టల్, గురుకులాలను ఎంపీ, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు విధిగా తనిఖీ చేయాలని, వాటిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యాన్ని ఆపేయాలని, పాఠశాల, గురుకులాలతో పాటు యూనివర్సిటీ స్థాయి విద్యా సంస్థల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీగా ఉన్న వారిని రెగ్యులర్‌ చేయాలని కోరారు.  

#Tags