AP Education System: సీబీఎస్‌ఈ పుస్తకాలతో కుస్తీ పడితే ఇప్పుడు మళ్లీ స్టేట్‌ సిలబస్‌ అంటారా..!

పుట్టపర్తి: విద్యార్థులకు మనమిచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదువు ఒక్కటే అని నమ్మిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అమ్మఒడితో ప్రతి ఒక్కరూ చదువుకునేందుకు అవకాశం కల్పించారు. నాడు– నేడుతో బడుల రూపురేఖలు మార్చేశారు.

ప్రభుత్వ బడుల్లోనూ ఇంగ్లిష్‌ మీడియం చదువులకు శ్రీకారం చుట్టారు. అలాగే సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌)తో పిల్లలను జాతీయ స్థాయిలో రాణించేలా చర్యలు తీసుకున్నారు. కానీ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కూటమి సర్కార్‌ జగన్‌ పథకాలకు మంగళం పాడుతోంది. ఈ క్రమంలో నిరుపేదల విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకుంటోంది.

  • గురుకులాల్లో సీబీఎస్‌ఈకి మంగళం
  • విద్యాసంవత్సరం మూడు నెలలు గడిచాక నిర్ణయం
  • చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపడుతున్న మేధావులు
  • పదో తరగతిలో ఇష్టానుసారం మార్పులు తగవని హితవు 2,920 మంది
  • గురుకులాల్లో పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థులు
  • సీఎం హోదాలో గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడూ వ్యవహరిస్తూ నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.
  • ‘‘పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు. ప్రైవేటు స్కూళ్లు బాగుంటాయి. డబ్బున్న వారు అక్కడ చదువుకుంటారు. మీరూ ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లండి’

విద్యా సంవత్సరం మూడు నెలలు గడిచాక

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో గత ప్రభుత్వం నిర్ణయం మేరకు..జిల్లాలోని 49 గురుకుల పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం సీబీఎస్‌ఈ సిలబస్‌లో పాఠాలు ప్రారంభించారు. ఇప్పటికే విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌లోనే యూనిట్‌ టెస్ట్‌లు కూడా రాశారు.

చదవండి: EWS Reservations in Medical Admissions: వైద్య కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్‌ అమలు

తాజాగా చంద్రబాబు ప్రభుత్వం సీబీఎస్‌ఈ సిలబస్‌ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మదింపు పేరుతో ఉత్తుత్తి పరీక్ష

ఇటీవల పదోతరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని మదింపు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం.. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు 50 ఇచ్చి ట్యాబ్స్‌ ద్వారా పరీక్ష నిర్వహించింది. రాత పరీక్ష కాకుండా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఆ ఫలితాలు ఏమిటన్నది ఎవరికీ తెలియదు.

ప్రభుత్వం మాత్రం సీబీఎస్‌ఈ సిలబస్‌ను విద్యార్థులు అర్థం చేసుకోవడం లేదని ఆ సిలబస్‌నే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పదో తరగతి విద్యార్థులు కొత్తగా స్టేట్‌ సిలబస్‌లో పాఠాలు చదవాల్సిన పరిస్థితి నెలకొంది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

సర్కార్‌ తాజా నిర్ణయాన్ని ఉపాధ్యాయులూ తప్పు పడుతున్నారు. విద్యా సంవత్సరం మూడు నెలలు గడిచాక మళ్లీ స్టేట్‌ సిలబస్‌లో కొత్తగా పాఠాలు చెప్పడం చాలా ఇబ్బంది అవుతుందని, సకాలంలో సిలబస్‌ పూర్తి కాకపోతే అది పదో తరగతి విద్యార్థులకు తీరని నష్టం చేకూరుస్తుందంటున్నారు. ప్రభుత్వం మాత్రం కేవలం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టారన్న ఏకై క కారణంగా సీబీఎస్‌ఈ రద్దుకే మొగ్గుచూపింది.

ప్రైవేట్‌ విద్యాసంస్థలకు మేలు

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలకు లాభం చేకూర్చేందుకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్‌ సెంట్రల్‌ సిలబస్‌ను రద్దు చేసిందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ముందు నుంచి కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ము కాస్తున్నారని, ప్రభుత్వ బడుల్లో సీబీఎస్‌ఈని రద్దు చేసి మరోసారి తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించారని వారు పేర్కొంటున్నారు.

#Tags