T-SATలో వ్యవసాయ ప్రసారాలు
సాక్షి, హైదరాబాద్: టి–సాట్ నెట్‌వర్క్ ద్వారా ఇక నుంచి వ్యవసాయ ప్రసారాలు అందించాలని నిర్ణయించినట్లు సంస్థ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
‘నిపుణ’చానల్‌లో సోమ, శనివారాల్లో సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు వ్యవసాయానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలుంటాయని తెలిపారు. ఇవే కార్యక్రమాలు మరుసటి రోజు ఉదయం 7 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ‘విద్య’ చానల్‌లో ప్రసారమవుతాయన్నారు.
ప్రతి మంగళవారం నిపుణ చానల్‌లో హార్టికల్చర్ కార్యక్రమాలు ప్రసారమవుతాయని, వీటిని మరుసటి రోజు ఉదయం ఏడు గంటల నుండి 8 గంటల వరకు ‘విద్య’చానల్‌లో ప్రసారం చేయనున్నట్లు చెప్పారు. ఇక సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో వ్యవసాయ కార్యక్రమాలపై జరిగే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో నిపుణుల సలహాలు పొందేందుకు 040– 23540326/726 టోల్ ఫ్రీ నెం.1800 425 4039 నంబర్లకు కాల్‌చేయాలన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags