New India Literacy Programme: చదువుకు వయసు అడ్డంకి కాదు

గద్వాల న్యూటౌన్‌: చదువుకు వయస్సుతో నిమిత్తం లేదని, చదువు రాని వారు ఏ వయస్సులో ఉన్నా చదువు నేర్చుకోవచ్చునని ఎన్‌ఐఎల్‌పీ జిల్లా ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ అనిత అన్నారు.

సెప్టెంబ‌ర్ 26న‌ స్థానిక ముస్సిపల్‌ సమావేశ మందిరంలో మెప్మా రిసోర్స్‌ పర్సన్‌లకు ‘న్యూ ఇండియా లిటరసీ’ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా ఆమె మట్లాడారు. 15 ఏళ్లు పైబడి నిరక్షరాస్యులుగా ఉన్న ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా మార్చాలన్న దృడ సంకల్పంతో ప్రభుత్వం న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క అక్షరాస్యులు ‘ఈచ్‌ ఒన్‌ టీచ్‌ టు’ గా చదువు చెప్పి అక్షరాస్యత శాతాన్ని పెంచేలా బాధ్యతను తీసుకోవాలని కోరారు.

చదవండి: Coaching for Teachers : ఉపాధ్యాయుల‌కు ఈ విభాగాల్లో మూడు రోజుపాటు శిక్ష‌ణ‌.. పూర్తి వివ‌రాలు..

మెప్మా రీసోర్స్‌ పర్సన్‌లు, చదువుకున్న స్వయం సహాయక సంఘాల సభ్యులు వలంటీర్లుగా మారి వారి పరిధుల్లోని నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల సభ్యులకు చదువు చెప్పి అక్షరాస్యులుగా మార్చాలని చెప్పారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

మున్సిపల్‌ కమిషనర్‌ దశరథ్‌ మాట్లాడుతూ న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమంలో అక్షరాస్యులు అందరూ భాగస్వాములై జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచాలన్నారు. అనంతరం కార్యక్రమంలో బాగంగా రూపొందించిన మ్యాచింగ్‌–బ్యాచింగ్‌ ప్రొఫార్మా కాపీలను కమీషనర్‌, పీఓలు అందజేశారు.

కార్యక్రమంలో మెప్మా ఏడీఎంసీ వెంకటేశ్వర్లు, టీఎంసీ శ్రీకర్‌, సీఓలు నిజాముద్దీన్‌, మహలక్ష్మీ, తిమ్మన్న, ఆర్‌పీలు పాల్గొన్నారు.
 

#Tags