మహిళా కళాశాలలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

డాబాగార్డెన్స్‌(విశాఖ): విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాలలో 10 పీజీ కోర్సుల్లో ఏపీపీజీ సెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.మంజుల తెలిపారు.

ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ ఎకనామిక్స్, ఎంకామ్‌(కామర్స్‌), ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్, ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్, ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ బోటనీ, ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు https://pgcetsche.apotnine.in/APP-GCET  ద్వారా వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలని కోరారు.

చదవండి: Job Mela: జాబ్‌మేళాకు విశేష స్పందన

మరిన్ని వివరాలకు 7780168423, 7032270810 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ మంజుల విజ్ఞప్తి చేశారు. 
 

#Tags