యూనివర్సిటీల్లో గిరిపుత్రులకు వసతి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులకు శుభవార్త. యూనివర్సిటీల్లో ఉన్నతవిద్య అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు ఉచిత వసతి కల్పించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక వసతి గృహాలు నిర్మించాలని నిర్ణయించింది.
యూనివర్సిటీల్లో గిరిపుత్రులకు వసతి

రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో బాల బాలికలకు వేర్వేరుగా వసతిగృహాలను నిర్మించి అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం వర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కామన్‌ హాస్టళ్లు ఉన్నాయి. ఈ హాస్టళ్లలో గిరిజన విద్యార్థులకు సీట్లు పరిమిత సంఖ్యలోనే ఉండటంతో మెజారిటీ విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లు, అద్దె గదుల్లో వసతి పొందాల్సి వస్తోంది.

చదవండి: గిరిపుత్రులకు కొలువుల శిక్షణ.. శిక్షణ కేంద్రాలివీ..

ఒక్కో హాస్టల్‌లో 500 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా భవన నిర్మాణం ఉండనుంది. ఒక్కో భవనానికి రూ. 5 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ లెక్కన ఏడు యూనివర్సిటీల్లో 14 భవనాల కోసం రూ. 70 కోట్లు ఖర్చు కానుంది. 

చదవండి: గిరిపుత్రుల సమగ్ర వికాసానికి బాటలు.. ఏకలవ్య

#Tags