Women IAS Officer Success Story : కటిక దారిద్య్రం.. నయం కాని వ్యాధి.. అయినా కూడా ఈ ల‌క్ష్యం కోస‌మే ఐఏఎస్ కొట్టానిలా.. కానీ..

ప్ర‌తి మ‌నిషి జీవితంలో స‌మ‌స్య‌లు రావ‌డం స‌హ‌జం. కానీ ఈమె జీవితంలో వ‌చ్చిన స‌మ‌స్య‌లు మాత్రం అసాధ‌ర‌ణం అయిన‌వి. అందులో కటిక దారిద్య్రానికి తోడు నయం కానీ వ్యాధితో సహవాసం చేసింది ఆమె. అడగడుగున కఠినతరమైన కష్టాలు.

అయినా వెరవక లక్ష్యం కోసం ఆహర్నిశలు పోరాటమే చేసింది. చివరికి అనుకున్నది ఐఏఎస్ ఉద్యోగం సాధించి స్ఫూర్తిగా నిలిచింది. ఈమె రాజస్తాన్‌కి చెందిన ఉమ్ముల్‌ ఖేర్‌. ఈ నేప‌థ్యంలో ఉమ్ముల్‌ ఖేర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

పుట్టుకతోనే..
రాజస్తాన్‌కి చెందిన ఉమ్ముల్‌ ఖేర్‌ బాల్యం డిల్లీలోని నిజాముద్దీన్‌లో మురికివాడలో సాగింది. పైగా ఖేర్‌ పుట్టుకతో ఎముకలకు సంబంధించిన డిజార్డర్‌తో బాధపడుతోంది. అయినప్పటికి చదువును కొనసాగించింది. 

➤☛ UPSC 2021 Civils Ranker: ఈ ఆప‌రేష‌న్ వ‌ల్లే ఉద్యోగం కొల్పోయా.. నాన్న చెప్పిన ఆ మాట‌లే ర్యాంక్ కొట్టేలా చేశాయ్‌..

ఎడ్యుకేష‌న్ : 
ఆమె ఢిల్లీ విశ్వ విద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత జేఎన్‌యూ నుంచి ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో ఎంఏ చేసింది.  అక్కడితో ఆగకుండా ఎంఫిల్ చేస్తూనే సివిల్స్‌కి ప్రిపేర్‌ అయ్యింది. ఈక్రమంలో 2012లో చిన్న ప్రమాదానికి గురయ్యింది.

ఏకంగా 16 ఫ్రాక్చర్లు 8 శస్త్ర చికిత్పలు అయినా కూడా..

అయితే ఆమెకు ఉన్న బోన్‌ డిజార్డర్‌ కారణంగా శరీరంలో ఏకంగా 16 ఫ్రాక్చర్‌లు అయ్యాయి. దీంతో ఖేర్‌ దాదాపు ఎనిమిది సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇన్ని కష్టాల ఐఏఎస్‌ అవ్వాలనే అతి పెద్ద లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. అందుకోగలనా? అన్న సందేహానికి తావివ్వకుండా తన లక్ష్యం వైపుగా అకుంఠిత దీక్షతో సాగిపోయింది. ఓ పక్క ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి ఆరోగ్యం వరకు ఏవీ ఆమె గమ్యానికి సహకరించకపోయినా.. నిరాశ చెందలేదు. పైగా అవే తనకు 'ఓర్చుకోవడం' అంటే ఏంటో  నేర్పే పాఠాలుగా భావించింది. 

☛➤ Women IAS Success Story : ఫెయిల్ అవుతునే ఉన్నా.. కానీ ప్ర‌య‌త్నాన్ని మాత్రం ఆప‌లేదు.. చివ‌రికి ఐఏఎస్ కొట్టానిలా..

చివరికీ ఆ కష్టాలే ఆమె సంకల్ప బలానికి..

ప్రతి అడ్డంకిని తన లక్ష్యాన్ని అస్సలు మర్చిపోనివ్వకుండా చేసే సాధనాలుగా మలుచుకుంది. చివరికీ ఆ కష్టాలే ఆమె సంకల్ప బలానికి తలవంచాయేమో! అన్నట్లుగా ఉమ్ముల్‌ ఖేర్‌ సివిల్స్‌లో 420వ ర్యాంకు సాధించింది. తాను కోరుకున్నట్లుగానే ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయ్యి ఎందరికో ప్రేరణగా నిలిచింది. ద టీజ్‌ ఉమ్ముల్‌ ఖేర్‌ అని ప్రూవ్‌ చేసింది.  నిత్యం స‌మ‌స్య‌తో పోరాటం చేస్తూ.. అనుకున్న ల‌క్ష్యం అనుకున్న‌ట్టే పూర్తి చేసిన ఉమ్ముల్‌ ఖేర్‌కు మ‌నం నిజంగా సెల్యూట్ చేయాల్సిందే.

☛ Inspiring Success Story : బిచ్చగాళ్లతో రోడ్డుపై పడుకున్నా.. ఇంట‌ర్‌లో అన్ని సబ్జెక్ట్ లు ఫెయిల్.. ఈ క‌సితోనే నేడు ఐపీఎస్ అయ్యానిలా..

#Tags