UPSC and APPSC Ranker Bhanu Sri Success Story : చిన్న వయస్సులోనే.. డిప్యూటీ కలెక్టర్.. ఐపీఎస్ ఉద్యోగం కొట్టానిలా.. కానీ..
గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్–1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి.. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన.. సివిల్స్‌లో 198వ ర్యాంక్ సాధించి.. ఐపీఎస్ ఉద్యోగంకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో సివిల్స్ ర్యాంకర్ భాను శ్రీలక్ష్మి అన్నపూర్ణ ప్రత్యూష సక్సెస్ జర్నీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష.. పశ్చిమ గోదావరి జిల్లాలో కాళ్ల (Kalla) మండలంకి (వీళ్లు ఊరు భీమవరం దగ్గర్లో ఉంటుంది) చెందిన వారు. తండ్రి గణేశ్న వెంకట రామాంజనేయులు, తల్లి ఉషా. ఈమె తండ్రి ఉండి దగ్గరల్లోని ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. వీరి కుటుంబంలో ఈమె ఏకైక కూతురు. ప్రత్యూష మొదట నుంచి చదువుపై ఉన్న ఆసక్తితోనే నేడు ఉన్నత శిఖరాలను అందుకుందని ఈమె తండ్రి గణేశ్న వెంకట రామాంజనేయులు తెలిపారు.
ఎడ్యుకేషన్ :
భాను శ్రీలక్ష్మి.. స్కూల్ ఎడ్యుకేషన్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే జరిగింది. అలాగే ఇంటర్ మాత్రం తెలంగాణలోని హైదరాబాద్‌లో శ్రీచైతన్య కాలేజీలు చదివారు. ఈమె టెన్త్‌లో 10 కి 10 పాయింట్లు సాధించారు. అలాగే ఇంటర్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 492 మార్కులు సాధించారు. ఇంటర్‌లో ఎంఈసీ గ్రూప్‌లో చేరారు. ఈమె బిఎ ఎకనామిక్స్ ఢిల్లీ యూనివర్సిటీలో చదివారు. అలాగే ఈమె యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్‌లో విజయం సాధించి.. ఐపీఎస్ ఉద్యోగంకు ఎంపికయ్యారు.
ఎంతో ఎఫెక్ట్ పెట్టి చదివా..
ఈమె ఏపీపీఎస్సీ గ్రూప్-1లో ఫస్ట్ ర్యాంక్ రావడం.. అలాగే యూపీఎస్సీలో కూడా మంచి ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ పరీక్షలకు చాలా కష్టపడి చదివానన్నారు. ఎంతో ఎఫెక్ట్ పెట్టి ఈ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించానన్నారు. మెయిన్స్ ఎగ్జామ్స్‌లో రాసే టైమ్‌లో చాలా క్లారిటీగా ప్రశ్న అడిగే తీరు బట్టి సమాధానం ఇచ్చాన్నన్నారు. మెయిన్స్‌లో ఎంత ఎక్కువ రాశాము అనే దాని కన్నా ఎంత అర్థవంతంగా రాసామన్నదే ప్రధానమన్నారు. అలాగే ఇంటర్వ్యూలో చాలా మంచిగా జరిగిందన్నారు.
ఐపీఎస్‌కు ట్రైనింగ్ కోసం..
ఐపీఎస్‌కు ఎంపికవడంతో ఆగస్టు 26వ తేదీ నుంచి ముస్సోరీలో జరగనున్న శిక్షణకు హాజరుకావాల్సి ఉంది. ఏడాది ఆగస్టులో విడుదలైన గ్రూప్–1 పరీక్షా ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. అనంతరం ఏలూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా ట్రైనింగ్‌లో ఉన్నారు.