Govind Jaiswal IAS Sucess Story: రిక్షా నడిపే తండ్రి, ఆ అవమానమే కలెక్టర్‌ను చేసింది, ఈ సక్సెస్‌ స్టోరీ తెలిస్తే..!

పేదరికాన్ని భరించడం కష్టంగానే ఉంటుంది. కానీ ఆ కష్టంలోంచి, బాధలోంచి పుట్టిన పట్టుదల, చిత్తశుద్ధి మాత్రం ఒక రేంజ్‌లో ఉంటుంది. విజయం సాధించేదాకా నిద్ర పోదు.   అలాంటి ఐఏఎస్‌  స్ఫూర్తిదాయకమైన కథను  తెలుసుకుందాం.

యాక్టర్‌ కొడుకు, యాక్టర్‌.. కలెక్టర్ సన్‌ కలెక్టర్ , డాక్టర్ తనయుడు డాక్టర్‌ అయితే స్టోరీ ఎలా అవుతుంది. రిక్షా నడుపుకునే  సాధారణ  వ్యక్తి కుమారుడు ఐఏఎస్ అవ్వడంలోనే సక్సెస్‌ కిక్‌ ఉంటుంది. కార్మికుడి కొడుకుగా అవమానాల్ని, అవహేళల్ని ఎదుర్కొని   ఐఏఎస్‌గా నిలిచిన స్టోరీ  ఆదర్శవంతంగా నిలుస్తుంది.

గోవింద్ జైస్వాల్ వారణాసికి చెందినవారు.గోవింద్ జైస్వాల్ తండ్రి నారాయణ్ జైస్వాల్ ఒక గవర్నమెంట్ రేషన్ షాప్ లో పని చేసేవాడు. అయితే ఆ రేషన్ షాప్ అనుకోకుండా మూసివేయడంతో ఉపాధి కోల్పోయాడు.  తన దగ్గర డబ్బులతో కొన్ని రిక్షాలను కొన్నాడు. వాటిని అద్దెకు తిప్పేవాడు. 

 

ఆ అవమానమే, ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది
ఇంతలో  గోవింద్‌ తల్లి  తీవ్ర అనారోగ్యం పాలైంది.  వైద్య ఖర్చుల నిమిత్తం ఉన్నదంతా ఖర్చయిపోయింది.దురదృష్టవశాత్తు  1995లో ఆమె కన్నుమూసింది దీంతో గోవింద్‌ తండ్రి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎలాగోలా ఆడపిల్లకు పళ్లి చేసాడు.

కానీ కొడుకుని చదివించాలన్న పట్టుదలతో నారాయణ స్వయంగా రిక్షా తొక్కడం మొదలు పెట్టాడు. అయితే తనతో పాటు చదువుకుంటున్న స్నేహితుల ఇంటికి వెళ్లినపుడు వారి తల్లిదండ్రులు గోవింద్‌ను అవమానించారు. తమ కుమారుడితో ఎప్పుడూ కనిపించొద్దంటూ దురుసుగా ప్రవర్తించారు.

తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ ర్యాంకు
అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఎలాగైనా గౌరవంగా బతకాలని నిశ్చయించుకున్నాడు తాను కలెక్టర్ చదువుతానని తండ్రికి చెప్పాడు. దీంతో ఆయన కష్టమైనా సరే రూ 40వేల  వెచ్చించి ఢిల్లీలోని ఒక  కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించాడు. అక్కడ తన ఖర్చుల కోసం గోవింద్ జైస్వాల్ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు. రాత్రి పగలు కష్టపడి చదివాడు.

2006లో గోవింద్ తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో యూపీఎస్‌సీలో 48వ ర్యాంక్ సంపాదించుకున్నాడు. గోవాలో స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా,ఆరోగ్య మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. జైస్వాల్‌  భార్య ఐపీఎస్ చందన్ చౌదరి. వీరికి ఒక కుమారుడున్నాడు.

12th ఫెయిల్‌ స్టోరీలా, మరో బయోపిక్‌: ఐఏఎస్ అధికారి గోవింద్ జైస్వాల్ జీవితం ఆధారంగా కమల్ చంద్ర దర్శకత్వంలో ‘అబ్ దిల్లీ దుర్ నహీ’  మూవీ కూడా సిద్దమవుతోంది. 

#Tags